నొస్టాల్జియా

 



పిల్లాడికి ఏవో పుస్తకాలు కావాలంటే దగ్గర్లో ఉన్న స్టేషనరీకి వెళ్ళాం. అది చిన్నపాటి గిఫ్ట్ షాప్ కూడా.వాడికి కావాల్సిన ఐటమ్స్ వెదుకుతూ తచ్చాడుతుంటే,ఒక రోలో నిండుగా ఆరలు అరలుగా పొదిగిన జ్ఞాపకాల లాంటి గ్రీటింగ్ కార్డ్స్.మనసు గిర్రున 90s లోకి రివైన్డయ్యింది.

టీనేజీ,బాల్యం తాలూకు జ్ఞాపకాలు యే రూపానా ఎదురు పడ్డా,నీరెండకి చెరువులో పడుకొని నెమరేస్తు తాదాత్మ్యం పొందుతున్న గేదెలా అయిపోతుంది మనసు. వచ్చిన పని మరిచిపోయి ఒక్కో కార్డు తీసి చదువుతు లోలోపల కులుకుతున్న నాకు ఎదో తట్టినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే...మా ఆవిడ!
శ్రద్ధగా చీటీలు రాసుకుంటున్న విద్యార్థిని దూరంగా నిలబడి గుర్రున చూస్తున్న ఇన్విజిలేటర్ లుక్కులో..
మౌనంగా వెళ్ళి వచ్చిన పని చూసుకొని బిల్లు కడుతుంటే కౌంటర్ పక్కన రోలో రేనాల్డ్స్ పెన్ పలకరించింది.చేయిపట్టి నన్ను ఎన్నో పరీక్షలు గట్టెక్కించిన పాత మిత్రుడు.అలా ఎలా వదిలేస్తాను.రెండు తీసి టేబుల్ మీద పెట్టి బిల్ అన్నాను..."పెన్నుతో రాసే మొహమేనా"అన్న ఆవిడ చెవిమాటు గుసరుసలు ఖాతరు జెయ్యకుండా!
కుక్కకు,కరెంటు పోలుకి ఉన్న అవినాభావ సంబంధం లాంటిదేదో మా 90 జెనరేషన్కి,నొస్టాల్జియాకి ఉంటుంది అనుకుంటా ప్రెండ్స్.

Comments

Popular Posts