రేజింగ్ రేషనలిస్టు!


 రేషనలిస్టు గోకినేని గారు వీపు గోక్కుంటు మార్నింగ్ వాక్ చేసుకుంటుంటే పార్కు గోడల మీద అంటించిన పోస్టరొకటి ఆయన దృష్టిని ఆకర్షించింది.అది చూడగానే లాడ్జి రైడింగులో పట్టుబడ్డ విటుణ్ణి చూసినప్పుడు కానిస్టేబుల్ నవ్వే నవ్వులాంటిది ఆయన మొహంలో వెలిగింది.

శాస్త్రీయ సంగీతం నేర్పబడును అని ఉన్న యాడ్ అది.
క్షణం ఆలస్యం చెయ్యకుండా అందులో నెంబర్ కి కాల్ చేసాడు.
ఏమిటండీ ఈ న్యూసెన్స్.ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటూ కేవలం శాస్త్రీయ సంగీతమే నేర్పుతాను అనే అహంకారపు పోకడలు ఏంటండీ మీకు.అయినా అది శాస్ర్తీయమైనది అని మీ దగ్గర ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయండి.వెస్ట్రన్ క్లాసిక్స్ నేర్పితే మీ ధర్మం ఒప్పుకోదా? - అంటూ రొప్పాడు.
నాకేది వచ్చో అదే నేర్పుతాను గాని రానిది ఎలా నేర్పుతానండీ? మధ్యలో ధర్మాదర్మాల తావెందుకండి? -అన్నాడు అవతల వ్యక్తి తాపీగా.
పాత పోకడలను జనాల నెత్తిపై రుద్ది దానికి సంప్రదాయం అనే ట్యాగ్ తగిలించి ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను చీకటి గుహల్లోకి తోస్తారు? ఏం ఆడిగేవాడు లేడనా మీ అహంకారం?
నాయనా అన్ని నువ్వే అని నేను అంటున్నా అనడం ఎంతవరకు న్యాయం? నేనేదో భుక్తి కోసం..
అదిగో మళ్ళీ భక్తి,భుక్తి అంటూ బుకాయిస్తే నీ పప్పులేం ఉడకవు నా దగ్గర. అర్జంటుగా మీ పోస్టర్లు తొలగించి నాకు సారీ చేప్పాల్సిందే.
పోస్టర్లు తీయడం సంగతి పక్కన పెడితే సారి నీకెందుకు చెప్పాలో నాకు తోయడంలేదు నాయనా.
వ్యవస్థ అజ్ఞానాన్ని ప్రారదోలి ప్రజలను విజ్ఞానం వైపు నడిపించే హేతువాదిని.నాకు చెబితే సమాజానికి చెప్పినట్టే.Come on, I need an unconditional apology.
అవతల వ్యక్తి దవడలు చప్పరించి తాపీగా - 'నాకు తెలిసిన ఒకాయన ఎయిడ్స్ నిర్ములనా పోరాటంలో చురుగ్గా పాల్గొని చివరకి ఎయిడ్స్ తో కన్నుమూసాడు.నిన్ను చూస్తుంటే ఎందుకో ఆయన గుర్తొస్తున్నాడు నాయనా. నాకు క్లాసుకి టైం అవుతుంది.ఉంటా' అని కాల్ కట్ చేసాడు.
వెంటనే గోకినేని fb లైవ్ పెట్టి గోడల మీద పోస్టర్లు చింపడం మొదలెట్టాడు.కింద కామెంట్లో ఒకడు 'రేయ్ లబ్బే,పనిపాట లేదా' అని కామెంటాడు.
'రేయ్ హౌలే..పుండాకోర్..నేనేమైనా రేషన్ షాప్ డీలర్ అనుకున్నవారా? రేజింగ్ రేషనలిస్టునిరా..టుమ్రీగా..చదువురాని బర్రే...నన్ను అనవసరంగా గెలక్కు..సుర్రు సుమ్మయిపోద్ది 'అంటూ క్లైమాక్స్లో తెలుగు సినిమా హీరోలా రంకెలేసాడు.
లైకులు,లాఫులతో కిక్కిరిసిన ఆ లైవులో ఒకానొక పసందైన కామెంట్ .
"కుజదోష నివారణ,నరదిష్టి యంత్రం,వశీకరణ మంత్రం కోసం 729700*** పై సంప్రదించండి".

Comments

Popular Posts