Skip to main content

Posts

Featured

Go Corona Go!!!

  మా ఫ్లాట్ ముందర ఫ్లాట్ ,డూప్లెక్స్. అందులో కృష్ణవంశీ సినిమాల్లోలా పిల్ల,పెద్దా,ముసలి,ముతక కలిపి రమారమి శ్రీలంక జనాభా ఉంటుంది.వేసవి సెలవులనుకొని భార్యాభర్తలు ఎవరి తరఫు బందువుల్ని వాళ్ళు పోటీపడి పిలిపించుకున్నారు కాబోలు.లేక, జాలిపడి దగ్గర్లో ఉన్న స్లమ్ము దత్తత తీసుకొని ఉండొచ్చు.ఏదైమైనా అది నాకవసరం లేని విషయం. బాధల్లా, ప్రతీ జంటకు ఇద్దరు పిల్లన చొప్పున ఒక డజను పిల్లలు రికాము లేకుండా కామన్ కారిడార్ లో రేయిపగలు కలియదిరుగుతున్నారు. గిన్నెల్లో అన్నం వేసుకొని వారి వెంట వాళ్ళ అమ్మలు.ఆ వైభోగం చూస్తూ చైర్లు వేసుకొని గడప బయట వృద్ద జంటలు.హాళ్ళో టీవీలో హై వాల్యూమ్ లో జబర్దస్త్ చూస్తూ మిగతా జనం. కనీసం రాత్రుళ్ళు కూడా మెయిన్ డోర్ మూయడం లేదు.మొన్నో రాత్రి నిద్రపట్టక చెత్త బుట్ట బయట పెడదాం అని తలుపు తెరిస్తే , హాల్లో వరసగా సునామీలో కొట్టుకొచ్చిన శవాల్లా మనుషులు.ఒకని వంటిపై ఊడిన లుంగీని మరొకడు మొహంపై కప్పుకు పడుకున్నాడు.నాకొచ్చిన కోపానికి, కరోనా వచ్చి ఉంటే గడప మీద కూర్చోని వాళ్ళ మీద కనీసం పావుగంట దగ్గేవాన్ని. ఇదిలా ఉంటే పొద్దున్నే కిచెన్లో నా మట్టుకు నేను అంట్లు తోముకుంటుంటే కారిడార్ లో అల్లరి చేస్తూ

Latest Posts

నొస్టాల్జియా

Happy Father's Day!!!

రేజింగ్ రేషనలిస్టు!

ట్రాఫిక్ సిగ్నల్

లుంగి

ఫేక్‍బుక్