ఫేక్‍బుక్



పోయిన శుక్రవారం , రోజూ కన్నా అరగంట ముందే వెళ్ళా ఆఫీస్కి అప్పటికే మిగతా టీం మెంబర్స్ వచ్చి గంటన్నర అయ్యిందని పక్కనున్న కొలీగ్ రజనీదేవి ఉప్పందించిందిలాస్టు బస్సు మిస్సయిన మొహాలేసుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు శుక్రవారం కదా , అందరూ కాజువల్ డ్రెస్సుల్లో వచ్చారు రజనీదేవి జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని జడ వేసుకుంది ఎలాంటి డ్రెస్సు వేసుకున్న కాళ్ళకి పట్టీలు , మొహాన బొట్టు మరిచిపోని కరుడుగట్టిన సాంప్రదాయవాది తను ..సదరు కాజువల్ అటైర్లో కాజువల్ లేబర్లా ఉంది సుబ్బారెడ్డి అయితే బ్లూ జీన్స్ మీద ఎర్ర చారల టీ షర్ట్ వేసుకొని పొట్టని జాగ్రత్తగా టక్ చేసి డెస్క్ మీద పార్క్ చేశాడు వీకెండ్ అనే విచక్షణ లేకుండా శుక్రవారం పూట కూడా ఆఫీస్ పనిచేసే ఇలాంటి కామన్సెన్స్ లేని జనాల నుండి డ్రెస్ సెన్స్ ఆశించడం దండగనుకొని , ఆఫీస్ మెయిల్ బాక్స్ ఓపెన్ చేశారెండు నెలల నుండి జరుపుతూ వస్తున్నరిపోర్ట్ ని రోజు డెలివరీ ఇవ్వకపోతే నా పేరు మీద మెయిల్ పెట్టి , ఆఫీస్ కాంటీన్ ఫుడ్ తిని ఆత్మహత్య చేసుకు చస్తానని యూజర్ బెదిరింపు -మెయిల్ .. దీనికి తోడు అర్జంటుగా సాల్వ్ చేయాల్సిన రెండు ప్రొడక్షన్ ఇష్యూలు ఇలాంటి ఒత్తిడిలో నన్ను నేను ఆహ్లాదపరుచుకోవడానికి వీలుగా నేనెన్నుకున్న సులభ మార్గం ఫేస్బుక్.

ఫేస్బుక్లో లాగిన్ అయ్యి చూసుకుంటే పది నోటిఫికేషన్లు వచ్చాయి . మొదటిది ఫోటో ట్యాగ్ నోటిఫికేషన్ … “నాగ్ హాజ్ ట్యాగ్డ్ యూ ఇన్ హిజ్ ఫోటో అని ఉంది .. నాగ్ అంటే మా నాగరాజుగాడు..వాడు కొత్తగా కడుతున్న ఇంటికి కొన్న బాత్రూం సామాగ్రిని ఫోటో తీసి పెట్టాడు ఫొటోలో వాష్బేసిన్కి టాగ్ చేశాడు నన్ను నేను నయం , మా రాజేష్ గాడినైతే ఏకంగా వెస్ట్రన్ లావెట్రీకి టాగ్ చేసాడు … ” రోజు స్నానం చేసే వాళ్ళకి కూడా ఇంత సామాను అవసరం ఉండదు రా .. హహహ అని కామెంట్ రాసి మండిన నా ఒంటిని చల్లార్చుకున్నా …. నా కామెంటుకు ముందున్న కామెంట్ చూసి కంపరం,వెగటు, అసహ్యాన్ని మిక్సీలో వేసి తిప్పితే ఏం పుడుతుందో అది పుట్టింది నాకు .. ఎవడో తలకుమాసినోడు దిక్కుమాలిన ఫోటోకి ” chooo chweeeet ” అని కామెంట్ రాశాడు రెండో నోటిఫికేషన్ నేను తిక్కరే్గి పెట్టిన థూ దీనమ్మా జీవితం అనే స్టేటస్ మెసేజ్ని నా ఎక్స్ గాళ్ఫ్రెండ్ ఎక్స్ బాయ్ఫ్రెండ్ LIKE కొట్టాడు మిగతా 8 నోటిఫికేషన్లలో 7 Farmville రిక్వెస్టులు పంట కోత కోయాలని , కోళ్ళు పెంచాలని , పిడకలెత్తాలని రండంటూ ఆహ్వానాలు అందాయి సైబర్ రైతులు ఇలా ఆన్లైన్లో వెచ్చించే సమయాన్ని నిజమైన పంటపొలాల మీద పెడితే దేశంలో నెలకొన్న ఆహారకోరత చాలా మట్టుకు తీరొచ్చనేది నా వ్యక్తిగత అబిప్రాయం. ఎవరి ఇష్టాలు వాళ్ళయంటారా ? అవుననుకోండి , కాని మరీ పెంపుడు పందుల పేరంటాలకి కూడ ఆహ్వానాలంటే ఎలా ? చివరగా ఏదో ఈవెంట్ నోటిఫికేషన్ ఉంది చందు గాడి మారేజ్ ఇన్విటేషన్ … ” చందు వెడ్స్ సౌమ్య అని తేదీ వెన్యూలతో సహా ఉందిఅంతా బానే ఉంది కాని వీడు ఫేస్బుక్లో లో పరిచయమయిన శ్రావ్స్ హనీ డాల్ ని కదా పెళ్ళాడుతా అని అంది గతంలో.. సదరు అమ్మాయితో పీకలలోతు ప్రేమలో ఉన్నానని మేము పీకల దాకా తాగినపుడు చెబుతూ విసిగించేవాడు అసలు విషయమేంటో కనుక్కుందామని ఆన్లైన్లో ఉన్న చందుగాడిని పింగ్ చేసా ..

నేను : అదేంట్రా ? ” శ్రావ్స్ హనీ డాల్ ని పెళ్ళాడే దాకా పచ్చి పెగ్గు ముట్టుకోనని బీర్ బాటిల్ మీద ప్రమాణం చేసి .. ఇప్పుడు .. ఇలా
చందు : అవి డైనోసార్ని చూడకముందు అన్న మాటలు
నేను : అదేంట్రా ??? జెనీలియాలా ఉందన్నావ్ నిజమే అనుకొని మేమెంత మదన పడ్డామో తెలుసా :D
చందు : ఫేస్బుక్లో జెనీలియా ఫోటో చూసి , ఫోన్లో గొంతు విని మోసపోయా మామ ఫేస్బుక్ జెనీలియా డిసుజా నిజజీవితంలో అరవింద డిసిల్వాలా ఉంటుంది ..రూపంలో జెనీలియా కాకపోయినా చేతల్లో మాత్రం జెనీలియా పోషించిన బొమ్మరిల్లు పిచ్చి హాసిని పాత్రకు మాత్రం తీసిపోదు కారణం లేకుండా నవ్వుతూ , రోడ్ల మీద పిచ్చి గంతులేస్తూ , రాత్రిళ్ళు ఐస్క్రీం బండోళ్ళ వెంటపడుతూ వాళ్ళని హడలెత్తిస్తూ బడుగు జీవుల బ్రతుకుదెరువుతో ఆడుకుంటూ ఉంటుంది …. పేరులో ఉన్న డాల్ చూసి నేనేదో బార్బీడాల్లా ఉంటదనుకున్నా కాని ఇది చేతబళ్ళు చేయడానికి వాడే డాల్మామా
నేను : మరి ఎలా వదిలించుకున్నావు రా ?
చందు : ఒక రోజు హోటల్ తీసుకెళ్ళి పీకల దాకా తిన్నాక బిల్లు కట్టమన్నా .. అంతే , మరుసటి రోజునుండి పత్తాలేదు .
నేను : తిక్క కుదిరేలా చేసావు అయినా నేను నవీన్ గాడు అప్పటికే బెట్లు కట్టుకున్నాం .. నీ మొహానికి జెనీలియా లాంటి అమ్మాయి ఏంటని ;)
చందు : …………………
నేను : రేయ్ ఉన్నావా ?
చందు : went offline ..

మీరు జాగ్రత్తగా గమనిస్తే పై సంభాషణలో నేను అనేదనేసి చివర్లో 😉,🤣,😋 లాంటి స్మైలీలు వాడా ఇదో నాసిరకం ట్రిక్కు ఎదుటువాన్ని చవట , దద్దమ్మ , డొనాల్డ్ ట్రంప్ అని తిట్టి చివర్లో 😉, 🤣, 😋 లాంటి స్మైలీలు తగిలిస్తే చాలు , కిక్కురుమనరు .. స్మైలీల వైభవం చూడాలంటే మీరు ఫేస్బుక్ గ్రూపుల్లో చొరబడాల్సిందే .. నేనో బలహీన క్షణాన జాయిన్ అయిన ఒకానొక గ్రూప్లో జనాలు టాపిక్తో నిమిత్తం లేకుండా , గ్రూప్ పర్పస్ని పక్కన బెట్టి ,మంచినీళ్ళ టాంక్ దగ్గర ఆడాళ్ళా తిట్టుకుంటూ మాటల చివర స్మైలీల తోకలు తగిలిస్తూ రతిప్రాప్తి పొందుతూ ఉంటారు .. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని ప్రూవ్ చేయడానికి నాలుగో కాలు నరికేసే సైకోగాళ్ళతో ఎప్పుడు కిటకిట లాడుతూ ఉంటుంది సదరు గ్రూపు గ్రూప్ నిండా దొర్లే పాత విట్లు , సటైర్లకి ప్రతీ అడుగునా కనబడేవి స్మైలీల స్ఫీడ్బ్రేకర్లే .. అక్కసు కక్కేసి బ్రాక్ట్లో No Offense , No Defense only Non Sense అని రాసి చివర్లో ఒక స్మైలీ తగిలిస్తే చాలు , తల్లి బిడ్డ పైలం ముళ్ళపూడి రమణ గారన్నట్టు జగం మిథ్య అనొకడంటే గజం మిథ్య అని ఇంకొకడు , కాదు అరగజం మిథ్య అని మరొకడు ” … ఇక్కడ అరగజం బాపతుగాళ్ళే ఎక్కువ :P ( చూసారా , అనేదనేసి చివర్లో స్మైలీ తగిలిస్తే వాతావరణం ఎలా తేలికపడుతుందో )

ఇహ ఫేస్బుక్ గోడల ( wall ) మీద కొంతమంది జనాలు వేసే భావోద్రేక పిడకల వైభోగం చూసి తరించాల్సిందే ఏదో ఒకటి రాయాలనే కక్కుర్తిలో మా సునీల్ గాడైతే స్త్రీ రేపురా ..” , ” సన్నీ లవ్స్ భాగ్య అంటూ పూర్వం వాడు పాతగోడల మీద రాసిన రాతలన్ని రాసి పాఠకులని అలరిస్తుంటాడు … ” ఏంట్రా ఇది అసహ్యంగా ??? …” అని అడిగితే , ” నా ఇష్టంఎక్కువ మాట్లాడితే దక్షిణమధ్య రైళ్ళ బాత్రూముల్లో రాసిన రాతలు కూడా రాస్తా .. ఖబడ్దార్ ..అని బెదిరిస్తాడు ఇలా ఏదో ఒకటి రాసి జనాల మదిలో చెరగని ముద్ర వేయాలనే వెంపర్లాటలో కొంతమంది తమ దినచర్యలని ఏకరవు పెడుతూ ఉంటారు .. ఉదాహరణకి నేనిప్పుడే స్నానం చేసి ఎండలో కూర్చున్నాను .. LOL” , ” నేను రోజు పేస్టు వేసుకోకుండా బ్రష్ చేసుకున్నాను .. ROFL ” , ” నేనీ రోజు పానీపూరి తిన్నానోచ్చ్ .. I am SO Excited”….ఇలాంటి అకృత్యాలు చూసి రక్తం మరిగినపుడు ఫేస్బుక్కోడు Like బటన్ పక్కన Hate బటన్ పెట్టుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఇహ స్టేటస్లకి పడే లైకులు , కామెంట్ల విషయంలో మాత్రం ఇక్కడ కాస్త లింగ వివక్ష ఉంటుందనే చెప్పుకోవాలి...ఆమ్మాయి పెట్టిన లవ్ మై టెడ్డీ అనే స్టేటస్ మెసేజ్కి 84 లైకులు , 72 కామెంట్లు వస్తే , అదే అబ్బాయి పెట్టిన లవ్ మై చారల చడ్డి కి కేవలం తన సొంత లైకు మాత్రమే ఉంటుందికాకపోతే అమ్మాయిలకి పడే అధికశాతం లైకులు మాకు అన్యాయం జరుగుతుందహో..అని ఫేసుబుక్కు గోడలెక్కి గగ్గోలు పెటే అబ్బాయిలనుండే అనుకోండి,అది వేరే సంగతి .. ఏదైతేనేం ఇక్కడంతా ఇలాగే పెళ్ళిళ్ళు పేరంటాల్లో జనాలు చూపే ఫేక్ పోకడలతో నిజజీవితంలో తమదికాని వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ కొంతమంది జనాలు చూపే కృతిమత్వం చూస్తే కొన్నిసార్లు దీనిని ఫేస్బుక్ కంటే ఫేక్బుక్ అనడం కరెక్టేమో అనిపిస్తుంది

Comments

Popular Posts