పెళ్ళి - లొల్లి
నెల రోజుల క్రితం మాట ... సంక్రాంతి పండక్కి ఊరెళ్దామని మా మేనేజర్ని వారం రోజులు సెలవడిగాను ... ప్రాజెక్ట్ డెడ్లైన్లు , వాడికున్న గ్యాస్ ట్రబుల్ , ఆఫీస్ టాయిలెట్లో టిష్యూ పేపర్ల కొరత మున్నగు అత్యంత కీలకాంశాలు సాకుగా చూపిస్తూ , నా లీవ్ అప్లికేషన్ని బుట్టదాఖలు చేసాడు ...
ఒళ్ళు మండిన నేను , లంచ్ బ్రేక్‌లో మిగతా కొలీగ్స్ ముందర , నేను రీసెంట్గా చూసిన మళయాళం డబ్బింగ్ మూవీలో సురేష్ గోబి విలన్ని తిట్టిన అమ్మనాబూతులన్ని మా మేనేజర్‌పై ప్రయోగించాను ... నా గట్స్ కి ఇంప్రెస్స్ అయిన మా కొలీగ్ సుబ్బారెడ్డి , పండక్కి వాళ్ళింటికి భోజనానికి రమ్మని పిలిచాడు ..
ఒక బ్రహ్మచారిగా నాకు లబించిన ఈ అరుదైన గౌరవాన్ని , అర్జెంట్‌గా ఎవరితోనైనా పంచుకోకపోతే అజీర్తి చేస్తుందని , నా చిన్ననాటి స్నేహితుడు రాజేష్ గాడికి ఫోన్ చేసి విషయమంతా చెప్పాను ..
మాటల మధ్యలో , " పెళ్ళెప్పుడ్రా ??? " అనడిగాడు వాడు ...
" అఫ్ఫుడే పెళ్ళెంట్రా నాకు ? అయినా నీకు తెలుసు కదా , బాల్యావివాహాలు చట్టరిత్యా నేరమని .. " అనన్నాను నవ్వుతూ సరదాగా ...
" నేనడిగేది నీ పెళ్ళి గురించి రా .. కరెక్ట్ టైమ్‌కి పెళ్ళయ్యుంటే నీకు పుట్టిన పిల్లల పెళ్ళి గురించి కాదు రా ... " అనన్నాడు సకిలిస్తూ ..
ఆ అవమానాన్ని భరించలేక పొయ్యాను ... వెంటనే కాల్ కట్ చేసి , వాడి నంబర్ని పెర్మనెంట్‌గా బ్లాక్ చేసాను ...
పండగ రోజు , సుబ్బారెడ్డింటికి బయల్దేరుతూ , ఒట్టి చేతుల్తో వెళ్తే బాగోదని , ఏమి తీసుకెళ్ళాలో పాలు పోక , పెరుగు తోడేసుకుంటున్న మా అమ్మమ్మకి ఫోన్ చేశాను ..
" అమ్మమ్మ ... నా స్నేహితుడింటికి భోజనానికి వెళ్తున్నాను .. ఖాళీ చేతుల్తో వెళ్ళొందంటారు కదా , ఏమి తీసుకువెళ్ళమంటావే ? " అనడిగాను ..
" పండగ పూట ఇంటికి రాకుండా , పూటకూళ్ళోడిలా పరాయి ఇళ్ళ మీద పడి తినే ఖర్మేమి పట్టిందిరా నీకు ? ఊరుగాని ఊరిలో ఉద్యోగం వద్దంటే విని చావవు .. నా మాట విని మన ఊరి స్కూల్లో పంతులుగా చేరి , మన దూరపు చుట్టం ప్రభాకర్ గారి అమ్మాయిని పెళ్ళి చేసుకొని హాయిగా ఇంటి పట్టున ఉండొచ్చు కద నాయన ..అమ్మాయి కుందనపు బొమ్మలాగ ఉంటుంది రా.. పైపెచ్చు మొన్ననే పదవ తరగతి ఫస్ట్ క్లాసులో ప్యాసయ్యింది కూడాను ..." అని అంది ...
" నీ మాట విని , మైనర్ బాలికని చేసుకున్నాననే కేసులో కటకటాలు లెక్కపెట్టే బదులు , ఇలా ఇళ్ళమీద పడి తినడమే సౌకర్యంగా ఉంటుంది నాకు .. నువ్వసలు సమస్యని ప్రక్క దారి పట్టించే ఎక్స్ పార్టీ ఎమ్మెల్యే లా మాట్లాడకుండా , అడిగిందానికి సమాధానం చెప్పవే ... ఏమి తీసుకెళ్ళాలో చెప్పు ??? "
" బహుమతులు , గట్రా అంటూ డబ్బులు దండగా చేసుకోకు నాయన .. అంతగా ఎమన్నా ఇవ్వాలనిపిస్తే భొజనం చేశాక యాభయ్యొక్క రూపాయలు కట్నం చదివించు " అంది ..
" నేను వెళ్ళేది శ్రీమంతం ఫంక్షన్‌కో లేక బారసాలకో కాదమ్మమ్మ .. డబ్బులు చదివించడానికి ... అయినా నిన్నడిగాను చూడు ,నాదీ తప్పు .. " అంటూ చిరాగ్గా ఫోన్ కట్ చేశాను ...
చేసేదేమి లేక , ఒట్టి చేతుల్తో వెళ్ళడం ఇష్టం లేక , చేతులకి గ్లోవ్స్ తొడుక్కొని బయలుదేరాను.
" సుబ్బారెడ్డింటికి అరగంటలో చేరుకొని , కాలింగ్‌బెల్ కొట్టాను .. "
" ఒకావిడ తలుపు తెరిచింది ... గ్లోవ్స్ వేసుకున్న నా చేతులకేసి అనుమానంగా చూసి , మామగారు అని అరిచి పిలిచింది .. వయసులో పెద్దాయనొకాయన లోపలి నుండి వచ్చాడు ... జేబులు కత్తిరించేవాడిని చూసినట్టు అనుమానంగా నన్ను ఎగాదిగా చూశాడు ..
నేను " అది , ఎందుకంటే .. సుబ్బారెడ్డి ... కొలీగ్ .. అమ్మ .. ఆవు .. బొమ్మా .. బొరుసు .. " అంటూ తెలుగు సీరియల్ పాత్రధారిలా , ఇబ్బందిగా మాట్లాడటం మొదలెట్టాను.
ఇంతలో ఆపద్భాందవుడిలా , " రా .. రా .. లోపలికి రా విజయ్ .. " అంటూ లోపలి నుండి వచ్చాడు సుబ్బారెడ్డి ..
" నేను చెప్పాను కదా ... నాతో పని చేసే కొలీగొకతను ఈ రోజు భోజనానికి వస్తాడని , తనే ఇతను " ... తన భార్య, నాన్న అంటూ , నన్ను చిరాగ్గా , " దాపురించావా ??" అన్నట్లు చూస్తున్న ఆ ఇద్దరిని నాకు పరిచయం చేసాడు ..
ఇబ్బందిగా నవ్వుతూ లోనికెళ్ళి సోఫాలో దిగబడ్డాను ....
నేనిప్పుడే వస్తాను , అంతసేపు ఇది చూస్తూ ఉండని తన పెళ్ళి ఆల్బమిచ్చి లోనికి వెళ్ళాడు సుబ్బారెడ్డి , నన్ను హాల్లో వదిలేసి.. ముసలాయన టీవి చూస్తున్నాడు ....
" పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపుడు వేళ్ళతో చూపిస్తూ , నవ్వుతూ , దంపతులిద్దరు దిగిన ఫోటొ చూస్తున్నా .. ఫోటొలో, పంతులు వాళ్ళిద్దరి కంటే ఎక్కువగా నవ్వుతూ కనిపించాడు ..బహుశా , పట్టపగలు తనకే కనబడని నక్షత్రాన్ని , కేవలం తన మాయమాటల్లో పడి , కనబడుతున్నట్లు నటిస్తున్న ఆ దంపతులని చూసి నవ్వుతున్నాడు కాబోలు ...
నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది ... నా కంటే బిగ్గరగా నవ్వుతూ వినిపించాడు ముసలాయన ... ఏంటా అని చూస్తే , టీవీలో " నేరాలు .. ఘోరాలు " వస్తుంది ... నూతన్ ప్రసాద్ వాయిస్ ఓవర్లో సీరియల్లో క్యారక్టర్లు చేతులు , తలలూపుతూ పెడుతున్న హావభావాలు చూసి నేను కూడా బిగ్గరగా నవ్వాను ...
నా నవ్వుకి , ఆ ముసలాయన నా వైపు చిరాగ్గా చూశాడు .... నవ్వడమాపేశాను నేను ...
కాసేపాగి , " పెళ్ళయ్యిందా బాబు ?? " అనడిగాడు ముసలాయన ....
" ఎవరికండీ ?? " అని తత్తరపాటులో నేనడిగిన ప్రశ్నకి , " నాకు " అని వెటకారంగా సమాధానమిచ్చాడు ముసలాడు ....
చేసెదేమి లేక , రాజేంద్ర ప్రసాద్‌లా ఒక నవ్వు నవ్వి , " అబ్బే ! ఇంక కాలేదండి " అని అన్నాను ...
" యే పాపం ? ఎందుకు " అనడిగిన ఆ ముసలాడి వాయిస్‌లో వ్రేళ్ళూనికపోయిన వెటకారం తాండవమాడింది ...
"ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి ... పిల్ల దొరకగానే పెళ్ళి " అని నా ప్రాసకి లోలోన సంబర పడ్డాను ...
" తొందరగా చేసుకో బాబు .. ముదిరిన బెండకాయ , ముదిరిన బ్రహ్మచారి ఎందుకు పనికి రావు బాబు? " అన్నాడు ఈవివి సినిమా డైలాగ్ రైటెర్లా , నా బాడీ లోయర్ పోర్షన్‌పై కాన్సెంట్రేట్ చేస్తూ ..
" నేనైతే, నీ వయసుకి తొమ్మిది మందిని కనేసి , ఆపరేషన్ కూడా చేయించుకున్నాను తెలుసా ??? " అన్నాడు మీసం మెలేస్తూ ..
" పందిలా డజన్ల కొద్ది కని , దేశ జనాభా సమస్యని పెంచిపోషించింది చాలక , ఎదో ఘనకార్యం చేసినట్టు మీసం మెలేస్తావేంటిరా ముసలి నక్క .... " అని కసి తీరా తిట్టుకున్న మనసులో ,బయటికి నవ్వుతూ ...
" ఏ ఊరోయ్ నీది ? " అని ముసలాడడిగిన ప్రశ్నకి , " రామగుండం , కరీంనగర్ జిల్లా " అని సమాధానమిచ్చాను ...
ఏంటీ ????? అనడిగాడు , టీవీని మ్యూట్‌లో పెడుతూ ..... నేను ఈ సారి పిన్‌కోడ్‌తో సహా అడ్రెస్స్ చెప్పాను ...
" తెలంగాణానా ???????????? "
అవును , ఐనా అన్ని క్వశ్చన్ మార్కులెందుకండీ ???
" నీకిక పెళ్ళి అయినట్టే ...... ప్రభుత్వం మీకు ప్రత్యేక రాష్ట్ర్రమే ఇవ్వట్లేదు , ఇంకా నీకు పిల్లనెవరిస్తారోయ్ ? తెలియకడుగుతా ... " అన్నాడు వెటకరిస్తూ ..
నా కోపం హాల్ సీలింగ్ దాకా చేరింది ... ఎలాగైనా ముసలాడి జుట్టు సంపాదించి , రాత్రికి చేతబడి చేసి , వాడి ఎడమ చెయ్యి ,నోరు పడిపోయేట్టు చేయాలని నిర్ణయించుకున్నాను ..
నా కోపం మీద నీళ్ళు జల్లుతూ , ముసలాడి బట్టతలపై , 4 వెంట్రుకలు ఫ్యాన్ గాలికి ఊగుతూ కనబడ్డాయి ... చేసేదేమి లేక , సురేష్ గోబి తిట్లన్ని మనసులో తిట్టుకొని సంత్రుప్తి పడ్డాను ..
ముసలాడు దిక్కుమాలిన ఓంకార్ గాడి డ్యాన్స్ షో పెట్టాడు టీవీలో ... నాకున్న కోపానికి చిరాకు , వెగటు , అసహ్యం , జుగుప్సలు జతయ్యాయి , ఆ షో చూస్తుంటే ...
క్షణక్షణానికి నా పరిస్థితి క్షీణిస్తుంది ... ఇంతలో నా ఫోన్ మోగింది ...
సిగ్నల్ అందనట్టు నటిస్తూ , ఇంటి బయటికి వెళ్ళి వెనక్కి తిరక్కుండా పరుగు తీసాను ...
ఆ ముసలాడి బారి నుండైతే తప్పించుకున్నాను , కాని ఒక బ్రహ్మచారిగా సమాజపు సూటిపోటి మాటల నుండి , దురాగతాల బారి నుండి మాత్రం తప్పించుకోలేకపొతున్నాను ... బ్రహ్మాచారి అంటే ప్రతీ వాడికి లోకువే ... " పప్పన్నం గురించి పెళ్ళి చేసుకోమనే వాళ్ళు కొంతమందైతే ..... యవ్వనం , పెట్రోల్ ఎక్కువ కాలం ఉండవని పెళ్ళి పేరిట లేని పోని అనుమానాలని లేవనెత్తే వాళ్ళు ఇంకొంతమంది ...
ఈ సాంఘీక దురాచారాన్ని అరికట్టే చట్టమే లేదా ??? సభ్యసమాజపు అసభ్య ధోరణిని ప్రశ్నించే నాథుడే లేడా ? ముదురు బెండకాయలు , పచ్చి కాకరకాయల్లాంటి పదప్రయోగాలపై పోటా లాంటి చట్టాలని ప్రయోగించే వెసులుబాటు లేదా ? తెలుగు సినిమాలో హీరోయిన్ ఒంటి నిండా బట్ట కట్టే రోజు రాదా ? ఒక్క అందమైన అమ్మయన్నా మా టీమ్‌లో జాయిన్ కాదా ? మీరు వాడే టూత్‌పేస్ట్ లో ఉప్పు లేదా ? క్షమించాలి , ఫ్లోలో సిలబస్‌లో లేని క్వశ్చన్స్ అడిగేశా ...

Comments
but " పందిలా డజన్ల కొద్ది కని " this is a little offensive.
"నీకిక పెళ్ళి అయినట్టే ...... ప్రభుత్వం మీకు ప్రత్యేక రాష్ట్ర్రమే ఇవ్వట్లేదు , ఇంకా నీకు పిల్లనెవరిస్తారోయ్ ? " ఇది మాత్రం పాపం.. ;-)
hehe hahaa.. saana saana bagundi...
infact, appati comedy show ni nuvu blog ga prachurinchamani mail kodadaamanukunnaa eelope, ee tapa...
bhesh vijay.. bhesh...:)
మీ కేటగిరీలోకి వచ్చేవే నా పోస్టులు కూడా..
ఈ పెళ్ళిగోల చదవండి
http://nivasindukuri.blogspot.com/2006/10/blog-post.html
http://nivasindukuri.blogspot.com/2007/06/blog-post_9908.html
Sudheer
కెవ్వు!
I laughed a lot after many days !
మీరిక రోజూ రాయాల్సిందే!
Awesome!
and
ma paste lo uppu
undo ledo naku telidu kani...
ne post lo kicku
undani na abhiprayamm....
pelli kaani vaadavani digulu chendhakuu..lalalaala lalilaa la..
hav more FUN....njyyyy...
cool one... suresh gopi (gobi kadu) ni baga vadukunnav :P
Labbe ani pettalsindi..
20 yrs tarvatha ee post choosi nuvvu ela feel autavo appudu comment cheyyu.. :P
naaku baaga nachina lines
నేను " అది , ఎందుకంటే .. సుబ్బారెడ్డి ... కొలీగ్ .. అమ్మ .. ఆవు .. బొమ్మా .. బొరుసు .. " అంటూ తెలుగు సీరియల్ పాత్రధారిలా , ఇబ్బందిగా మాట్లాడటం మొదలెట్టాను.
Yi line degara ni face feelings ani kanapadaayi ,
Nijamaina bramachaari feeling ni chepav yi kindi line lo "ఇంట్లో సంబంధాలు చూస్తున్నారండి ... పిల్ల దొరకగానే పెళ్ళి " అని నా ప్రాసకి లోలోన సంబర పడ్డాను ...
Antha baagunna i expected more , story inkonchem saagunte baagundedemo anipichindi ,
mundhu avi:
1.Amma aavu bomma borusu yi style chala bagundhi...!
2.Sofa lo dhigabaddaanu,kshana kshanam naa paristhithi kshinisthondhi.. laanti narration baa nachindhi..!
3.lenght kooda oka plus pointee..simple and crisp..!
ippudu ivi:
1.Padhi la dozenla koddhi..ane polika..konchem harsh ga anipinchindhi...!
2.glows vesukoni bayaldheranu varaku oke...aa thread continue cheyatam meedha palu anumaanaalu vekthamavthunnai...!
3.Climax loki lead inkaastha slow gavachivunte bagundedhi..!
good language vj
Over all Rating :
3.5/5