కిరికిరి
అవి నేను డిగ్రీ చదువుతున్న రోజులు ... నేను కాలేజికి హాజరయిన రోజుల సంఖ్యలో నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాల సంఖ్యని తీసివేయగా వచ్చే ఫలితాన్ని ఎల్లప్పుడు ఋణసంఖ్యగా ఉండేట్టు జాగ్రత్త పడుతూ వస్తున్నాను , గత 2 సంవత్సరాల నుండి ... ఇది మూడవ సంవత్సరం , పైపెచ్చు ఆఖరి సంవత్సరం కనుక ఎలాగైనా నా ఈ ట్రాక్‌రికార్డ్ పదిలపరచుకోవాలనే కృతనిశ్చయంతో , మొక్కవోని పట్టుదలతో , ప్రతీ రోజు లాగే " రేపటి నుండి కాలేజికెళ్దాం " పథకం క్రింద , వెచ్చగా ముసుగు తన్నుకు పడుకున్న ఒకానొక రోజది ...
" ఒసేయ్ రజిత ... నన్ను వెధవని చేసి ఆ అజయ్ గాడితో కులుకుతావటే ??? నన్ను అమాయకుణ్ణి చేసి ఆడిస్తావటే ??? సోషల్ గేదెరింగ్లో అందరు చూస్తుండగా నీ సవరం ఊడిపోతుందే !ఆదిత్య టీవి యాంకర్ నీకు మొగుడిగా దొరకుతాడే ! నువ్వింతకింతా అనుభవిస్తావే ... ఇదే నా శాపం .. ఇదే నా..నా..నా శా ,, శా .. ,శా .. పమ్..మ్..మ్.మ్..మ్ ... "
సినిమా థియేటర్ ప్రహారీ గోడనానుకొని ఉండే ఇంట్లో వాళ్ళకు లీలగా వినపడే సినిమా డైలాగులకు మళ్ళే , నాకు పై డైలాగులు వినిపిస్తున్నాయి ...
" ఒసేయ్..య్..య్.య్ ర..జి..త..త..త..తా ... " అన్న గావుకేకకి ఈ సారి ఉలిక్కిపడి లేచా .. ప్రక్కకు తిరిగి చూసా ... గాఢనిద్రలో , నాలుక చప్పరిస్తూ రాజేష్ గాడు పెడుతున్న " గావు కలవరింతలు " అవి ..
నార్కో అనాలసిస్ టెస్ట్ కి గురవుతున్న పట్టుబడ్డ పాక్ ప్రేరిత ఉగ్రవాది మల్లే , ఎదేదో మాట్లాడుతూ నాలుక చప్పరిస్తున్నాడు .. వాడి ఆర్తనాదలని ఆపడానికి ఎప్పటికి మళ్ళే గట్టిగా ఒక తన్ను తన్నా .. మూలగడం ఆపాడు ... నాలుక ఇంకా చప్పరిస్తూనే ఉన్నాడు ... ఈ సారి లాగి పెట్టి తన్నాను ... తన్ను పని చేసింది .. చచ్చిన శవంలా కదలకుండా పడుకున్నాడు ...
హమ్మయ్యా ! అనుకొని ఒక నిట్టూర్పు వదిలి , ముసుగు తన్ని పడుకున్నా .... నేను తన్నిన తన్నుకి దుప్పటి ఎగిరి దూరంగా పడింది ... చేసేదేమి లేక దుప్పటి తీసుకుందామని లేచా ... మసక కళ్ళతో తూర్పు వైపున తెరిచి ఉన్న కిటికీ వైపు చూశా ... సూర్యుడు కనబడ లేదు ... గోడ గడియారంలో టైమ్ 5:౦5 అవుతుంది ... హమ్మయ్యా ఇంకా తెల్లార్లేదనే సంతోషంతో , ఈ సారి ఫీట్లకి పోకుండా దుప్పటి మామూలుగా కప్పుకు పడుకున్నాను ... మెల్లిగా నిద్రలోకి జారుకున్నా ... అలా జారుతున్న నన్ను , తలుపు బాదుళ్ళ శబ్ధాలు లాగి , నిద్ర లేపాయి ...
ఎవడయ్యుండచ్చబ్బా ? ఇంత తెల్లారు జాముననుకోని పక్కకి తిరిగి చూశా .. రాజేష్ గాడు ఘాడ నిద్రలో ఉన్నాడు ... చిత్తుగా గుడుంబా సేవించి ఫ్లాట్‌ఫారం మీద పడుకున్న రోజు కూలీలా ఉన్నాడు ...వాడితో పాటు భగవంతుని మీద నాకు కోపం వచ్చింది ... సునామీ తాకిడికి కూడా చెక్కు చెదరని నిద్రని రాజేష్ గాడి లాంటోళ్ళకిచ్చి , చీమ తుమ్మిన ఉలిక్కి పడి లేచే శాపం నాకెందుకు ఇచ్చాడా అనుకోని , నా దురదృష్టానికి స్వీయ సంతాపం ప్రకటించుకొని , ఒక నిమిషం మౌనం పాటించడం మొదలెట్టాను ... ౩౦ సెకన్ల నా మౌనాన్ని చేధిస్తూ , మళ్ళి మొదలయ్యాయి తలుపు వీర బాదుళ్ళు ...
ఇంత పొద్దున్నే అంటే , కచ్చితంగా ఇంటి ఓనరయ్యుంటాడు ... అద్దె కోసం వచ్చినట్టున్నాడు కుయ్యా గాడు ... అయిన మొన్ననే మూడు నెలల క్రితమే కదా అద్దె ఇచ్చింది , మళ్ళి అప్పుడే దాపురించాడా దరిద్రుడు , ఇరిటేటింగ్ ఫెలో .. కొట్టి కొట్టి వాడే వెల్లిపొతాడు ... ఇల్లు వానిదే కనుక తలుపులు విరగొట్ట్టుకోని మరీ ఇంట్లోకి దూరే ఛాన్స్ లేదు కనుక , నేను సేఫ్ , అనుకొని సౌండ్ రాకుండా వికటాట్టహాసం చేసాను .. కాసేపటికి తలుపు బాదుళ్ళు ఆగిపోయాయి .. విజయ గర్వంతో ముసుగు తన్నాను ... మళ్ళీ ఎగిరి దూరంగా పడింది , దుప్పటి .. మళ్ళి లేచే ఓపిక లేక , పక్కన రాజేష్ గాడి దుప్పటి లాక్కొని కప్పుకున్నా ....
అప్పటి వరకు వున్న దుప్పటి లేని ప్రభావం కాబోలు , రాజేష్ గాడిలో కాస్త చలనం మొదలయ్యింది ... బూడిదలో కుక్కలా అటూ ఇటూ దొర్లుతున్నాడు ... కాసేపాగి మెడ బర బరా గొక్కున్నాడు ... గట్టిగా ఒక నిట్టూర్పు వదిలి , మొలకి కట్టుకున్న తన గల్లా లుంగీని లాగి మొహం మీద కప్పుకున్నాడు ... నేను తక్షణమే స్పందించి , తెలుగు సినిమాల్లో దుండగుల చేతిలో రేపుకి గురయి వివస్త్ర అయిన హీరో సిస్టర్ ఒంటి మీద బట్ట కప్పే సెకండ్ హేరోఇన్లా , నా దుప్పటి తో సహా రెండు దుప్పట్లు వాడి మీద కప్పి , గట్టిగా ఊపిరి పీల్చుకున్నా ... చేసేదేమి లేక రెండు చేతులు కాళ్ళ మద్యలో పెట్టుకోని ,బలవంతంగా కళ్ళు మూసుకున్నాను ... బుర్రలో ఎవేవో ఆలొచనలు ఖో - ఖో ఆడుకుంటున్నాయి .. నెమ్మదిగావస్తున్న నిద్రని వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ...
ఇంతలో మళ్ళీ తలుపు ధబధబలు ఊపందుకున్నాయి ... అగ్నికి ఆజ్యంలా పక్కన రాజేష్ గాడు గురకందుకున్నాడు .. ఒక వైపు తలుపు వీర బాదుళ్ళు , మరో వైపు ఒక నరరూప రాక్షసుడి " హాహాకారాలు " , వెరసి , జుగల్ బంధీ కాంపిటీషన్‌ని తలపించాయి , నాకు తలనొప్పినొదిలేస్తూ ... నా పరిస్థితి నిమిషనిమిషానికి క్షీణిస్తుంది ... ఆస్థిపంపకాల్లో ఇద్దరి పెళ్ళాల మద్యన నలిగిపోతున్న అమాయకపు భర్త పరిస్థితిలా తయారయ్యింది నా పరిస్థితి ... ఒక వైపు తలుపు వీర బాదుళ్ళు మరో వైపు రాజేష్ గాడి " గురకార్తనాదాలు " ... ఇంతటి నాయిస్‌ని అప్పట్లో వచ్చిన తెలుగు సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో కూడా వినలేదు ... ఆరు నూరైనా ,నూరు నూర్జహానైనా ససేమిరా తలుపు తెరిచెదే లేదు , అని మంకుపట్టు పట్టింది ఓటమెరగని నా మనస్తత్వం ... కనీసం రాజేష్ గాడి గురక తప్పించుకుందామనే ప్రయత్నములో వాడిని ఒకటి లాగి తన్నా ... నా కోపం కాస్త చల్లారింది .. రాజేష్ గాడి గురక తీవ్రత మరింత పెరిగింది ..
ఈ సారి తలుపు బాదుళ్ళ శబ్ధం ఆగి , ఇనుప బీరువా జరిపినట్టు కీచు శబ్దాలు వినిపించాయి ... ఎలుకలు అంత్యాక్షరి ఆడుకంటున్నాయి కాబొలు ... " ఈ వారాంతం ఎలుకల మందు కొని , ఎలకలతో పాటు రాజేష్ గాడికి కూడ కాస్త అన్నంలో కలిపి పెడితే పీడా విరగడవుతుంది .." అనే ఆలోచన నన్ను క్షణికానందానికి గురి చేశాయి ...
మళ్ళవే శబ్ధాలు ,కీచు రాగంలో...ఈ సారి కాస్త చెవులు రెక్కించి విన్నాను ... " ఒరేయ్ విజయ్‌గా ! తలుపు తియ్యి బే ... నీ యబ్బ ... తియ్యరా తలుపు .. " అన్న మాటలు కీచుగా వినిపిస్తున్నాయి .. ఇంతటి దిక్కుమాలిన గొంతు సునీల్ ’గాడిద’య్యుండొచ్చనే ధీమాతో వెళ్ళి తలుపు తీశా ... నా అనుమానాన్ని నిజం చేస్తూ , " ఎంత సేపు కొట్టాలిరా తలుపు ? "అంటు కోవై సరళ మేల్ వర్షన్లా చిరాకు పడుతూ లోనికొచ్చాడు ... వాడి వాయిస్ ముందర రాజేష్ గాడి గురక శివరంజని రాగంలా తోచింది నాకు ...
" ఇంత పొద్దున్నే దాపురించావేంది బే ? " అని నిద్ర కళ్ళతో చిరాకు పడ్డాను ..
" పొద్దున్నేంది బే ? మధ్యాహ్నం ఒంటి గంటవుతుంటే .... " అన్నాడు ...
" ఒంటి గంటా ???? అరగంట ముందర 5 అయ్యింది కదా , పై పెచ్చు తూర్పు కిటికీలో నుండి రోజు కనబడే సూర్యుడు కూడా కనబడలేదే ఈ రోజు ? ... " అన్నాను అసహనంగా ..
" సూర్యుడు మీ తూర్పు కిటికీని పొడవడం ... నెత్తిక్కెక్కడం , పొద్దున్నే కూసిన కోడిని మీ ఇంటి ఓనర్ గాడు కోసుకు తినడం కూడా అయిపోయింది ... " అన్నాడు సునీల్ గాడు
" ఐతే , ఇంతకు ముందర గడియారంలో చిన్న ముల్లుని పెద్దగా , పెద్దదాన్ని చిన్నగా పొరబడ్డానన్నమాట .. "అని నాలుక కరుచుకున్నా ..కాస్త గట్టిగా కరుచుకోవడం వల్ల నాలుక మీద రెండు పంటి గాట్లు కూడా పడ్డాయి ..
" ఈ రోజు కాలేజి లేదా ? " అనడిగాడు సునీల్ గాడు , పడుకున్న రాజేష్ గాడి లుంగీ లాగుతూ ...
" ఈ రోజే కాదు , రోజూ ఉంటుంది ... నేనే పోలేదు ... అయినా ఎప్పుడు కాలేజికెళ్లాలని ఈ రోజు కొత్తగా అడుగుతున్నావేంది రా ?? " అన్నాను ..
" నీకేమైంది ... రోజు వెళ్ళేవాడివి , ఈ రోజెళ్ళలేదే ? " అనడిగాను తల దువ్వుకుంటూ ..
" వెళ్దామనే అనుకొని ఇంటి బయటకొచ్చి చూస్తే , మా వెధవ పెంపుడు కుక్క నా చెప్పులను కొరికి కైమా చెసింది ... టైమ్ కి మా అమ్మమ్మ చెప్పులున్నాయి కనుక సరిపోయింది ... " అన్నాడు గుమ్మం బయట విప్పిన చెప్పులని చూపిస్తూ ..
" ఉప్పు సత్యాగ్రహంలో బ్రిటీష్ వాళ్ళు జరిపిన లాఠిచార్జీలో జరిగిన త్రొక్కిసలాటలో దొరికాయి కాబోలు ఆ చెప్పులు , వాళ్ళ అమ్మమ్మకి .. మన దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి నిలువుటద్దాల్లా ఉన్నాయి ఆ చెప్పులు .. "
ఆ చెప్పులు చూసి మనసు కరిగిన నేను , " బజారుకెళ్ళి చెప్పులు కొనుక్కుందాం , కాస్త తోడూ రారా " అన్న సునీల్ గాడి అభ్యర్థనని కాదనలేక పోయాను ..
నేను స్నాన కార్యక్రమాదులు ముగించుకొని బాత్రూమ్లో నుండి బయటికొచ్చా .... రాత్రి మిగిలిన స్టాక్‌తో సహా క్లీన్‌స్వీప్ చేసి , తినడానికి ఇంకేమి దొరకక , పాత చింతపండు ముక్కని చప్పరిస్తూ కిచెన్‌లో నుండి బయటికోచ్చాడు , సునీల్ గాడు ...
ఒరేయ్ బక్క బకాసురా ! కనీసం చింతపండన్నా వదిలెయ్యరా .. నువ్విలా " కాదేది తినననర్హం " పథకం క్రింద ,మీ పెంపుడు కుక్క బిస్కెట్లు తినకపొయి వుంటే ఇప్పుడు నీ బతుకు ఇలా కుక్కలు చింపిన చెప్పుల్లా తయారయ్యి ఉండేదా ? చెప్పు ? అన్నాను తల తుడుచుకుంటూ ....
" సర్లే తొందరగా పదా ... లేటవుతుంది ... సాయంత్రం " ఇనుప రేకులు " సీరియల్ టైముకల్లా వెనక్కి వచ్చేయ్యాలి మనం ... అసలే చాలా ఇంపార్టంట్ ఎపిసోడ్ ఇవ్వాళ ... సీరియల్లో హీరోయిన్ తన మూడో మొగుణ్ణి వదిలేసి మాజీ ప్రియుడితో వెళ్ళిపొతుందా , లేక రెండో పెళ్ళాన్ని వదిలేసి తన వెంట పడుతున్న మన్మథ రావుని తన జీవితంలోకి ఆహ్వానిస్తుందా ?? అనే సస్పెన్స్‌కి ఈ రోజుతో తెరపడుతుంది " అన్నాడు చింతపండు మీద ఉప్పు జల్లుకుంటూ ...
వాడి మాటళ్ళో పడి చొక్కా మీద బనియన్ వేసుకున్నాను ....
" రాజేష్ గాడిని కూడ , కూడా తీసుకెళ్దాం , మంచి బేరగాడు .." అన్నాడు రాజేష్ గాడి లుంగీ లాగుతూ ...
" వాడిని లేపే ప్రయత్నంలో , అలసిపోయి , నువ్వు పడుకుంటావే గాని వాడు లేచే ప్రసక్తే లేదు " అన్న నా హెచ్చరికని గౌరవించి మళ్ళీ చింతపండు నాకడంలో నిమగ్నమయ్యాడు సునీల్ గాడు ..
" మా ఈ గోళతో ఎలాంటి సంబందం లేదన్నట్టుగా , ఈజిప్షియన్ మమ్మీలా కదలకుండా పడుకున్నాడు " రాజేష్ గాడు ..
డ్రెస్స్ అప్ అయ్యి , దగ్గరున్న ఆటో స్టాండ్‌కి బయళ్దేరాం ఇద్దరం ...
ఆటొవాడితో రూపాయి , అర్థణా అంటు బేరానికి దిగాడు , సునీల్ గాడు ... నాకు ఎందుకో ఎడమ కన్ను కొట్టుకుంటుంది , మనసేదో కీడు శంకించింది ...
వెనక నుండి ఎవరో భుజం తట్టినట్టనిపించి , ప్రక్కకి చూసా ... ఎవరూ కనబడలేదు ... తిరగాల్సింది ప్రక్కకి కాదు , వెనక్కని గ్రహించి వెనక్కి తిరిగి చూశా ...
నాగరాజు గాడు , నా హైస్కూల్ మేట్ ... పేరుకు తగ్గట్టే పాములాంటోడు , కాకపొతే ఈ పాము మన్ను తిన్న మంజరి పాము లాంటిది ... సొంతింటికి కన్నం వెయ్యబోయి , పక్కింటోళ్ళకు పట్టుబడి కటకటాలు లెక్కబెట్టి ఈ మధ్యే బయటికొచ్చాడు ...
" యేందిరా భయ్ ? గిక్కడేమ్ జేస్తుళ్ళు బే ... గీ హౌళా గాన్తోటి యేడికి పోతానవురా ? " అంటూ తన పసిడి వర్ణ దంత శోభని చూపిస్తూ నవ్వాడు , అన్ అఫీషియల్ పాన్‌పరాగ్ బ్రాండ్ అంబాసిడర్ లా ..
" హౌళా సునీల్ గాడు చెప్పులు కొందామంటే బజారుకి వెళ్తున్నాము ... " అన్నాను ..
" ఫాళ్తూ గాళ్ళ లెక్క ఉన్నరేందిరా భయ్ ? చెప్పులు కావాలంటే గుడికి పోవాలె గాని , గిట్ల బజారుకు పోయి పైసలు పెట్టి కొనడమేందిరా భయ్ ? అన్నాడు , సునీల్ గాడి భుజం మీద చెయ్యేస్తూ ...
ఇవేమి పట్టించుకోకుండా రూపాయి తగ్గించమని ఆటోవాడితో అసెంబ్లీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు సునీల్ గాడు ..
నాగరాజు గాడు జోక్యం చేసుకోని " నువ్వాగురా సునీల్ గా ! నేను మాట్లాడుతా ఉండు ... నీకసలే దిమాక్ తక్కువ .. " అంటూ ఆటోవాళాతో బేరానికి దిగాడు ...
తలా ఒక్కింటికి ౩ రూపాయల కంటే తక్కువ తీసుకోనని మంకుపట్టు పట్టాడూ ఆటోవాడు ...
" అరే గిట్ల కాదు గాని , ముగ్గురికి కలిపి 10 రూపాయాలిస్తాం .. లొల్లి జెయ్యకుంటా బండి ఇస్టాట్ జెయ్యి .. " అన్నాడు నాగరాజు గాడు పాన్‌పరాగ్ ప్యాకెట్ చించి నోట్లో వేసుకుంటూ ..
" కాదు .. కాదు .. తొమ్మిదిన్నరిస్తా " అంటూ తన కక్కుర్తి , మూర్ఖత్వం ఏకకాలములో చాటాడూ సునీల్ గాడు ...
పోలీస్ రైడింగ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్ట్టుబడ్డ విటునిలా నిశ్చేష్టున్నయి చూస్తున్నాను ఈ దారుణాన్నంతా , ఏమీ దిక్కు తోచక ...
నేను తేరుకునేలోపే , మమ్మల్ని ఎక్కించుకొని ఆటొవాడు డైరెక్ట్ నాలుగవ గేర్‌లో బండి స్టార్ట్ చేసి పోనిచ్చాడు ... నాగరాజు గాడు రన్నింగ్‌లో ఎక్కాడు ..
ఆటో వెళ్తూ ఉంది ... కాసేపు నిశ్శబ్ధం రాజ్యమేలింది మా మధ్యన ... మనసు ప్రశాంతంగా ఉంది .. మాటల్లో చెప్పలేని ఆనందం అది ..
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ " ఎక్కడికి బయల్దేరావురా నాగరాజు గా ? " అనడిగాడు సునీల్ గాడు ..
శ్రీదేవి థియేటర్‌కి పోతున్నా ... " వయసు కరిచింది" అని మళయాళం డబ్బింగ్ సినిమా ఆడుతుందట ... షకీలా ఉందట సినిమాలో అన్నాడు కన్ను గీటుతూ ..
" నేను కూడ వస్తా మామ ... చెప్పులు కొనుక్కొని వెళ్దాం ... ఎమంటావురా విజయ్‌గా ? " అంటూ నా వైపు తిరిగాడు సునీల్ గాడు ..
" మరీ సాయంత్రం నువ్వ్వు చూడాల్సిన సీరియల్ సంగతో ? " అన్నాను అనుమానంగా
" దిక్కుమాలిన సీరియల్ ఎప్పుడైనా చూడొచ్చు ... షకీలా సినిమానట మామ..మ..మ..మ " అన్నాడు కారుతున్న చొంగ తుడుచుకుంటూ ..
నా అర్థాంగీకారాన్ని మౌనంగా వ్యక్తపరిచా ,చొంగ కారకుంటా జాగ్రత్త పడుతూ ....
" సార్ .. సినిమా జబర్దస్తుగుంది , మొన్ననే జూసిన ... షకీలా పక్కన హీరో అచ్చం గీ సార్ లాగనే ఉండు " అంటూ నాగరాజు గాడి వైపు చూపించాడు ఆటోవాడు ..
సునీల్ గాడు ఫక్కున , నేను బిగ్గరగా నవ్వాను ఆటోవాడి మాటలకి ... నాగరాజు గాడు సన్నగా సకిలించాడు ...
చెప్పల్ బజార్లో దిగాము ఆటో ... దాదాపు అక్కడున్న అన్ని షాపులు తిప్పాడు మమ్మల్ని సునీల్ గాడు , ఎక్కడా బేరం కుదరక .... వాడికి చెప్పులు కొనే ప్రయత్నములో తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయాయి ...
" రూపాయి , రెండు రూపాయల దగ్గర కిరికిరి యేంది రా భయ్ ?? ఖంజూస్ సాలే ! సినిమా టైమ్ అయితాంది రా , తొందరగా కొనురా భయ్ .. " అని పాన్‌పరాగ్ తుప్పిళ్ళు సునీల్ గాడి మొహం మీద పడేట్టు గట్టిగా అరిచాడు నాగరాజు ...
ఆఖరి ప్రయత్నంగా బాటా షోరూమ్ కెళ్ళాం ... వాడికి నచ్చిన చెప్పులు వేసుకోని రెండు రౌండులేసి , మా ఇద్దరి వైపు చూసి ఎలాగున్నాయన్న ఒక ఎక్స్ప్రెషనిచ్చాడు సునీల్ గాడు... ఇంకా వాడితో తిరిగే ఓపిక లేక , ఆ చెప్పులు వాడి కాళ్ళకి చండాలంగా ఉన్నా బాగున్నాయన్నట్టుగా తలలూపాము ... ధర కేవలం 999.9999 రూపాయలు మాత్రమే అని వున్న ప్రైస్ ట్యాగ్‌ని చూస్తు ఇచ్చే ధర చెప్పు అనడిగాడు సేల్స్ మెన్ని ...
" ఇక్కడన్ని ఫిక్స్ డ్ రేట్లు సార్ , నో డిస్కౌంట్ " అన్నాడు సమాధానంగా సదరు సేల్స్ మెన్ ..
" అలా కాదు కాని , 500 ఇస్తా ఫైనల్ గా " అని అన్నాడు సునీల్ గాడు , ఇల్లు కాలిపొతున్నా ఫైరింజన్కి మిస్డ్ కాల్ ఇచ్చే తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ..
" మీరు చెప్పిన ధరకు ఒక చెప్పు మాత్రమే ఇవ్వగలను , సార్ " అన్నాడు సేల్స్ మెన్ తన మండిన ఒంటిని చల్లార్చుకుంటూ ...
నోటి నిండా గుట్కా ఉండటం మూలానా నాగరాజు , నోట్లొ మాట బయటికి రాక నేను మూగ ప్రేక్షకుళ్ళా విస్తుపోయి చూస్తూ ఉన్నాం ఆ దారుణాన్నంతా ...
" ఫైనల్‌గా 599 ఇస్తా , ఇచ్చేయ్ ... " అని బేరమాడడంలో వెళ్ళూనీకపోయిన తన గజిని మొహమ్మద్ లాంటి పట్టుదలని చాటుతూ ...
" థూ .. దీనమ్మా జీవితం " అంటూ బయటికెళ్ళాడు నాగరాజు గాడు .. చేసేదేమిలేక , కంటతడితో ,ముక్కు ఎగచీదుకుంటూ నాగరాజు గాడిని ఫాలో అయ్యాను ..
" ఆగరా ..నేను వస్తా " అన్న నా మాట ఖాతరు చేయక , వెనక్కి తిరిగి చూడాకుండా , ఆటొ ఎక్కి వెళ్ళిపోయాడు నాగరాజు గాడు ..
నాకేం చేయాలో పాలు పోలేదు ... మిట్ట మధ్యాహ్నం నెత్తిన ఎండకి మాడు కాలి పొతుంది ... ఆల్రెడీ ఒకవైపు సునీల్ గాడి టార్చర్‌కి తల బొప్పి కట్టింది ... నోరెండుకుపోతుంది .. అవసరం తీరాక ,విలన్ చేతిలో మోసగించబడీ ఊరిగాని ఊరిలో వదిలేయబడిన తెలుగు సినిమా హీరో చెళ్ళెలిలా ఉంది నా పరిస్థితి ...
ఎడారిలో ఒయాస్సిస్లా , కాస్త దూరంలోనా కంటపడింది ఒక " సోడాబండి " ... పరుగెత్తుకు వెళ్ళి ఒక " నిమ్మసోడా " అనడిగా బండి వాడిని ... " కిచ్చాక్ క్ క్ క్ క్ క్ క్ క్ క్ క్ " అని వాడు సోడా కొట్టిన సౌండ్‌కి , అంత నీరసంలో కూడా అప్రయత్నంగా ఒక నవ్వు వచ్చింది నా మొహానా ... ఎత్తిన సోడా దించకుండా తాగా ... ప్రాణం లేచొచ్చినట్టనిపించింది ..మరో సోడా తాగి దగ్గరున్న బస్టాండ్ వైపు బయలుదేరా ...
" గోళీసోడెయ్..య్..య్..య్..య్ " అన్న సోడాబండి వాడి అరుపు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది ...
నేను మనసులో " గోళీసోడెయ్..య్..య్..య్ " అనుకుంటు వాడికి కోరస్ అందుకున్నా ....

Comments
1.Nidra nu vrudhhi..anee prayogam baagundhi
2.Yelukala anthaakshari poolika baagunnaai..!!
3.Manchi manchi telugu padhaalu vichhalavidi ga vaadadam chaala bagundhi..!!
4.Rajesh naluka korukkovatam.. Super ga vundhi..!
Other end:
1.Second 3/4 th(second half kanna kaastha yekkuva) kaastha dragging anipinchindhi..!
2.COncept lo Kaastha Nuuthanathvam vundi vunte bagundu..!
3.Title justification Post lo ichhi vuntee marinni maarkulu sampaadihnchachhu.!
4.Vijay character oka saari manchi telugu lo oka saari telangana yasa lo maatlaadatam konni questions ki dhaari theesindhi..!
Mothhaniki yi posting ki naa rating 3 out of 5.. :)
ప్రతీ రోజు లాగే " రేపటి నుండి కాలేజికెళ్దాం " పథకం క్రింద ...
"సోషల్ గేదెరింగ్లో అందరు చూస్తుండగా నీ సవరం ఊడిపోతుందే !ఆదిత్య టీవి యాంకర్ నీకు మొగుడిగా దొరకుతాడే !"
"నార్కో అనాలసిస్ టెస్ట్ కి గురవుతున్న పట్టుబడ్డ పాక్ ప్రేరిత ఉగ్రవాది మల్లే , ఎదేదో మాట్లాడుతూ.."
"చిత్తుగా గుడుంబా సేవించి ఫ్లాట్‌ఫారం మీద పడుకున్న రోజు కూలీలా"
"బూడిదలో కుక్కలా.."
" గురకార్తనాదాలు "....
"కోవై సరళ మేల్ వర్షన్లా.."
"తినడానికి ఇంకేమి దొరకక , పాత చింతపండు ముక్కని చప్పరిస్తూ.."...
చాలా చాలా ఉన్నాయి ఇలా..నవ్వులు పంచిన ప్రయోగాలు.
అసలు మీ బ్లాగు పేరే భలే ఉంది.
బద్ధకించకుండా రెగ్యులర్ గా రాస్తూ ఉండండి.
keep it up.
pathakaalu,
'monnane' moodu nelalu kritam adde ivvatam !
tannu panichesindi antukunte lechadu anukunna.. kalavarintha aapadu ani telisi fullga navvocchindi !
sivaranjani ragam
chokka meeda banyan veytam
vayasu karichindi... ohhahaha
999.9999.... haha
narration chala bagundi..
other side : dadapu line line ki comedy and creativity choopinchadam valla okati rendu sarlu monotony vacchindi..
but still chala bagundi..
alage
golisoda climax kooda bagundi, daaham teerina effect vacchindi !
ilanti post ki chala time teeskuni updated ga raaskovali, really good work.
ప్రతి వాక్యం చాలా చాలా బాగుంది . మచ్చుకి కొన్ని 1.సునామీ తాకిడికి కూడా చెక్కు చెదరని నిద్రని రాజేష్ గాడి లాంటోళ్ళకిచ్చి , చీమ తుమ్మిన ఉలిక్కి పడి లేచే శాపం
2. సౌండ్ రాకుండా వికటాట్టహాసం
3.బూడిదలో కుక్కలా
4.ఆస్థిపంపకాల్లో ఇద్దరి పెళ్ళాల మద్యన నలిగిపోతున్న అమాయకపు భర్త లా
5. ఈ వారాంతం ఎలుకల మందు కొని , ఎలకలతో పాటు రాజేష్ గాడికి కూడ కాస్త అన్నంలో కలిపి పెడితే పీడా విరగడవుతుంది .
6.ఉప్పు సత్యాగ్రహంలో బ్రిటీష్ వాళ్ళు జరిపిన లాఠిచార్జీలో జరిగిన త్రొక్కిసలాటలో దొరికాయి కాబోలు ఆ చెప్పులు , వాళ్ళ అమ్మమ్మకి.
7.పెంపుడు కుక్క బిస్కెట్లు తినకపొయి వుంటే
8.చెప్పులు కావాలంటే గుడికి పోవాలె గాని , గిట్ల బజారుకు పోయి పైసలు పెట్టి కొనడమేందిరా
ఎంత బాగా రాసారో, కాని Title Name match అవ్వలేదు . Title కి కూడ కామెడీ టచ్ ఇస్తే ఇంకా మంచి మార్కులు పడేవి