' హెల్ ' మెట్
ఆదివారం , 11 : 30 AM ...
ఆదివారం సెలవు అనే ఆనందాన్ని రేపటి నుండి మళ్లీ ఆఫీసుకెళ్ళాలనే బాధతో దిగమింగుతూ నిద్రలేచే విధివంచితుల్లో నేను ఒక్కన్ని ... ఒక వైపు హాంగోవర్ మరోవైపు ఆకలి బాధను భరిస్తూ దీనికంతటికి కారణమయిన చందు గాన్ని నానా శాపనార్థాలు పెడుతూ బెడ్ మీద నుండి లేచా ..
ప్రస్తావన వచ్చింది అని కాదు కాని చందూ గాడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే వాడి గురించి మొత్తం తెలుసుకోవాలంటే ఇలా టపాలు కాదు ఒక పుస్తకమే రాయాలి ..
“ కాదేది తాగాననర్హం “ అనుకునే వాళ్ళలో మేలిమి రకం వీడు ... విస్కీ లో పాలు , బ్రాందీ లో పచ్చి పులుసు , వోడ్కా లో టీ ఇలా చెప్పుకుంటూ పోతే వీడి భారిన పడని ద్రవ పదార్థం అంటూ లేదు ఈ భూప్రపంచంలో ...
కంపెనీ ఇవ్వకపోతే విస్కీ పోసుకొని తగలబెట్టుకుంటానన్నవాడి బెదిరింపులకు లొంగి... ఎప్పటి లాగే వాన్ని వదిలి చరణ్ గాడితో తో సెట్ అయిన వాడి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ స్టోరి వింటూ... అది విని తట్టుకోవల్సిన మనోధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నములో అప్రయత్నముగానే శక్తికి మించిన డోసు పట్టించా ....
సీన్ కట్ చేస్తే , భారంగా నిద్రలేచి , పడి లేస్తూ హాల్ లోకి వచ్చి సోఫా లో కూర్చోన్నా ...అలవాటుగా పక్కన్నే ఉన్న పేపర్స్ లో ఇంగ్లీష్ పేపర్ తెరిచి హెడ్‌లైన్స్ ఏంటో చూద్దామని చదవడం మొదలు పెట్టా ... పేపర్ చదివి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అన్న అపోహతో ఇంగ్లీష్ పేపర్ సబ్‌స్క్రైబ్ చేసే జనబాలో నేను చేరి ఇప్పటికీ 3 నెలలు ....ఎప్పటి లాగే ఏమీ అర్థం కాకా " పరభాషను పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు “ అని సంతృప్తి పడుతూ పక్కనే ఉన్న ఈనాడు పేపర్ తెరిచా …
" ఇక హెల్మెట్ తప్పనిసరి ... హెల్మెట్ లేకుంట బండి నడిపితే 500 రూపాయల జరిమాన " అన్న హెడ్లైన్ చూసి అప్రయత్నంగా వచ్చిన నవ్వును ఆపుకుంటూ... " గత 5 సంవత్సరాలుగా లైసెన్స్ లేకుంట బండి నడిపితే లేని ఫైన్ ఇప్పుడు హెల్మెట్ లేకుంటే నట ? ఏంటో పిచ్చి ప్రభుత్వం.... " ఐనా నా లాంటి డైహార్డ్ బైకర్స్ కి హెల్మెట్ అవసరమా ? నెవర్ ! " అనుకుంటూ మేన్ పేపర్ గిరాటూ వేసి పక్కనే ఉన్న సన్డే స్పెషల్ తెరిచా...
2,3 పేజీల మినహా మిగతాది అంత హెల్మెట్ గురించే .. హెల్మెట్ కంపనీ లు డబ్బులు ఇచ్చి మరి రాయించుకున్నటూ ఈ ఆర్టికల్ .. చేసేదేమీ లేక పేజీలు తిరగేస్తూ కొంత వింతగా అనిపించి " సంజీవనీ ఈ హెల్మెట్ " అనే టాపిక్ దగ్గర ఆగాను …. హెల్మెట్ అవసరం అది వాడకుంటే కలిగే కష్ట నష్టాల గురీంచి ఎవడో గాని గణాంకలతో సహా తినేసాడు ... హెల్మెట్ వాడకుంట డ్రైవ్ చేస్తే నగర కాలుష్యానికి చర్మ & శ్వాస సంబందిత క్యాన్సర్ ల తో పాటు ఏయిడ్స్ కూడా రావొచ్చు అని వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నన్ను కంగారు పెట్టి హెల్మెట్ వైపు ఆలోచించే దిశగా ప్రేరేపించాయి .. ముఖ్యంగా యువకుల్లొ వచ్చే చర్మ , కేశ సంబంధిత సమస్యల గురించిన టాపిక్ చదివి అద్దం ముందుకు పరిగెత్తా ..
" వానకి తడిసి , ఎండకి ఎండి , చలికి ఒణికి అనావృష్ఠి పాలైన వరి పంటలా తయారయ్యింది నా జుట్టు పరిస్థితీ ... మొహం మీద పొలుసులు చూసి పున్నమినాగు సినిమా లో చిరంజీవి గుర్తొఛ్చాడు నాకు ... నాకు పట్టిన ఈ గతికి నా మీద నాకె జాలి వేసి .. ఇక హెల్మెట్ కొందామని డిసైడ్ అయ్యా …
మధ్యాహ్న భోజన పథకాన్ని ముగించుకొని హెల్మెట్ కొందామని బయలుదేరుతూ , ఇంటి బయటకి వొచ్చి బైక్ తీసి ఇగ్నీషన్ ఆన్ చేసా … అప్పటి వరకు గాఢ నిద్ర లో ఉన్న బైక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నా వైపు దీనంగా చూస్తూ " ఒరేయ్ ! పాపాత్ముడా ! ఆదివారం కూడా వదలవా రా ?నాశనమైపోతావురా " అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ...
పాపం బైక్ దీనస్థితి చూసి జాలేసింది ... మందు పెట్టిన కుక్కలాగా తయారయ్యింది దాని వాలకం ... దాని మొహం మీద గుడ్డవేసి ఆల్మోస్ట్ 6 నెలలు అయ్యింది ...స్టార్ట్ చేద్దామని కిక్ కొట్టా..ఊహు లాభం లేదు .. 10,12 కిక్ ల తర్వాత .. వచ్చే వారం తప్పకుండా సర్విసింగ్ ఇస్తా అని దేవుని మీద ప్రమాణం చెయ్యించుకొని మరి స్టార్ట్ అయ్యింది .. పాపం పిచ్చి ప్రాణి !! ఎప్పుడు అర్థమవుతుందో దీనికి నా వాగ్ధానాలు కూడా ప్రభుత్వం ఇచ్చే " ఉచిత విద్యుత్ పథకం " లాంటివేనని ..
బిక్షాటనానికి బయలుదేరిన బౌద్ధ సన్యాసికి మల్లె దిశా నిర్దేశం లేకుంట సాగుతున్న నా బైక్ యాత్రను , తార్నాకా ఫుట్‌పాత్ మీద ఉన్న హెల్మెట్ స్టోర్ ఆపింది ..
పొద్దుంనుండి ఏ బకరా దొరకలేదేమో ….నన్ను చూడగానే ఆనందంతో రెండు పిల్లి మొగ్గలు వేశాడు ఫుట్ పాత్ హెల్మెట్ స్టోర్ ఓనర్ ..
" ఆఓ సాబ్ , జబ్బర్దస్థ్ హెల్మెట్ లు సాబ్ " అంటూ సకిలించాడు..
“ ఏక్ దమ్ సాలిడ్ హెల్మెట్ హైన్ సాబ్ … బండ లాగా ఉంటది ..ఏక్ దమ్ గ్యారెంటీ మాల్ .. నీకి నాకీ భరోసా ఇస్తాయి “ అన్నాడు తెలుగుర్దూలో ..
“ నీ నాకుడు ఆపి హెల్మెట్ లు చూపించార అక్కు పక్షి .. బండలు కాదురా ముండాకోర్ “ ఆని అనడం ఆలస్యం ఒక్కొక్కటిగ హెల్మెట్ లు చూపించడం మొదలెట్టాడు ...1,2,3 … పెరుగుతూ పోతుంది నేను ట్రై చేసే హెల్మెట్ ల సంఖ్య .. అదేదో నచ్చక కాదండోయి… పట్టక …
ఈ విషయం లో కొంచెం క్లారిటీ రావాలంటే మీకు నా తల గురించి చెప్పాలి ..
"తల గుండ్రంగా ఉంటుంది "అన్న సిద్దాంతానికి మినహాయింపు నేను. కోడిగుడ్డు అంటే చిన్నగా ఊహించుకుంటరేమో ..
ఇంచుమించు కొబ్బరిబొండం సైజ్ , కోడిగుడ్డు ఆకారం లో ఉంటుంది నా తల…
వాడి దగ్గర ఉన్న మోడెల్ లు అన్ని ట్రై చేసి ఆఖరి ప్రయత్నముగా , ఉన్న వాటిలో పెద్ద సైజ్ హెల్మెట్ ని తలకు అతి కష్టం మీద తొడిగిచ్చాడు … "చావు తప్పి కళ్ళు లొట్ట లు పడటం "అంటే ఏంటో ఆ క్షణాన అర్థం అయ్యింది నాకు ..టైమ్ బాగుండి హెల్మెట్ బయటికి రాకపోతే “ హెల్మెట్ ధరించబోయి దుర్మరణ పాలైన యువకుడు “ అన్నావార్త మర్నాడు దాదాపు అన్ని రకాల పత్రికల్లో వచ్చేదేమో ...
“ సాబ్ .. జిందగీల గిట్లాంటి తలకాయ చూడలే...డైరెక్ట్ కంపనీ కి ఆర్డర్ చేసి తయారు చెయ్యించాలి సాబ్ మీకు హెల్మెట్ .. ఎందుకైనా మంచిది ఒకసారి కోటి ల ట్రై జెయ్యుండ్రి .. హక్కడ ఐతే కంపనీ షోరూంలు ఉంటాయి .. కిస్మత్ మంచిగుంటే మీ సైజ్ హెల్మెట్ దొరకొచ్చు “ అని సకిలించాడు ...
అవమానంతో కూడిన దుఃఖాన్ని దిగమింగుతూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆఘమేఘాల మీద అక్కడినుండి కోటి కి బయల్దేరా … ఎలాగైనా నా సైజ్ హెల్మెట్ కొని వాడికి తగిన గుణపాఠం చెప్పాలనే ప్రతీకారేచ్ఛతో కోటికి చేరుకున్నాను ..
ప్రభుత్వం బియ్యం,కిరోసిన్‌లతో పాటు హెల్మెట్ లను కూడా చేర్చిందేమో కాబోలు... జనాలు రేషన్ షాప్ ముందర నిలబడ్దట్టు బారులు తీరారు హెల్మెట్ షాప్ ల ముందర ..
జన సంద్రాన్ని ఈదుకుంటూ ఎలాగో అలా లోపలికి చేరుకొని అక్కడున్న సేల్స్ బోయ్ కి హెల్మెట్ చూపించ మన్నట్టు సైగ చేసా …
ఎలాగైనా నాతో హెల్మెట్ కొనివ్వాలన్న వాడి ఉత్సాహం ఎంతో కాలం నిలవలేదు .. ఉన్న స్టాక్ మొత్తం ట్రై చేసి విసిగిపోయి ..
" చివరగా ఇది ట్రై చెయ్యండి సార్ ... డిస్ప్లే గురించి కంపనీ ప్రత్యేకంగా తయారు చేయించింది.. మామూలుగా ఐతే రెండు తలకాయలు పట్టగా కొద్దిగా ఖాళీ మిగిలుతుంది.. ఇది కూడా పట్టకపోతే నేను ఏమీ చెయ్యలేను సర్ .. మానవ ప్రయత్నానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది సార్ , పెద్ద మనసు చేసుకొని మీరే అర్థం చేసుకోవాలి అని కంటతడి పెట్టుకున్నాడు ...
" హమ్మయ్య .. కొద్దిగా టైట్ అయినా పట్టింది .. "
ఆ క్షణాన చూడాలి ఆ సేల్స్‌మెన్ మొహంలో ఆనందం ... పెళ్ళైన పది సంవత్సరాలకి మొదటిసారి గర్భవతి అయిన స్త్రీకి కల్గె ఆనందానికి ఏ మాత్రం తీసీపోకుండా ...
ఎలా ఉందో చూసుకుందామని అద్దం ముందుకు వెళ్ళి నిలబడ్డా... అద్దం లో నా వెనక ... వస్తున్న నవ్వును చేతులు అడ్డం పెట్టుకొని మరి ఆపుకుంటున్న సేల్స్ గర్ల్స్ కనిపించారు ... ఎందుకు నవ్వరు ?.. నాకె నవ్వు వచ్చింది నా అవతారం చూసి ... గాలికి స్పేస్ సూట్ చిరిగి పోయి ఒక్క హెల్మెట్ మాత్రం మిగిలినట్టు ఉన్న వ్యోమగామి లాగా ఉంది నా అవతారం ..
హెల్మెట్ వాడటం మొదలెట్టి ఇప్పటికీ 5 సంవత్సరాలు ... దాన్ని వాడటం వల్ల వచ్చిన ప్రయోజనాలు పక్కన పెడితే కనీసం ఎండు గడ్దిలాగైన ఉండే నా జుట్టు సగం కొట్టుకపోయి దివాలా దిశగా పయనిస్తుంది .. ఎక్స్ట్రా లార్జ్ హెల్మెట్ దెబ్బకి మెడ నరాలు చేతులెత్తేశాయి … మున్ముందు శరీరంలో ఇంకెన్ని అవయవాలు చేతులెత్తేస్తాయో చూడాలి ...

Comments
" Space suite galiki chinigi poga,helmet okate migilipoina astronut lagaa" :-) bagundi varnana
Am sure as you post more, ull show lot more maturity in vyangyam..
Nenu nee vennante unna...mana Telugu Comedy kalama talliki tagu sahayam cheddam...ALL THE BEST
Uuuu BloggerNUT
కత్తి లా ఉంది టపా. కంటిన్యూ...
comment కి word verification తీసెయ్యగలరు.
ఇరగ తీసినావె.
ఇదె ప్రహసనం కొనసాగించు
ChaduvuTunnaTa sepu Navvutunne Unna
konni spelling mistakes unnayi avi chooskunte sari...
rasi chala yendlaainattundi... marala oka night mandu kottadam manesi inko tapa vesthe memu kooda santoshistaam... : peru choosi confuse avvaddu nenu Keshavcharan ni !